తెలంగాణ మాదకద్రవ్య నిరోధక కార్యక్రమానికి మద్దతు
ABN , Publish Date - Jun 12 , 2025 | 06:08 AM
తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో చేపట్టిన ‘ఆపరేషన్ సంకల్ప్’కు మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ మద్దతు పలికింది. డ్రగ్స్ రహిత...
తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో చేపట్టిన ‘ఆపరేషన్ సంకల్ప్’కు మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ మద్దతు పలికింది. డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించే లక్ష్యంతో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్యా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మాదాల రవి తదితరులు పాల్గొని ప్రచార చిత్రాలు ఆవిష్కరించారు.