Mohan Vaddlapatla: కేన్స్ ఫెస్టివల్ లో ఎం4ఎం ప్రైవేట్ స్క్రీనింగ్

ABN , Publish Date - May 12 , 2025 | 05:03 PM

ప్రముఖ నిర్మాత మోహన్ వడ్లపట్ల తొలిసారి దర్శకత్వం వహించిన 'ఎం4ఎం' మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రైవేట్ స్క్రీనింగ్ కాబోతోంది.

ప్రముఖ అమెరికన్ నటి జో శర్మ (Jo Sharma) నటించిన సినిమా 'ఎం4ఎం' (M4M). మోటివ్ ఫర్ మర్డర్ అనేది దాని అబ్రివేషన్. గతంలో ''మల్లెపువ్వు (Mallepuvvu), మెంటల్ కృష్ణ (Mental Krishna), కలవరమాయే మదిలో'' Kalavaramaye Madilo) చిత్రాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల (Mohan Vadlapatla) 'ఎం4ఎం'ను డైరెక్ట్ చేశారు. మే 17న కేన్స్ లోని పాలైస్ - సి థియేటర్ లో సాయంత్రం ఆరు గంటలకు ప్రైవేట్ స్క్రీనింగ్ జరుగనుంది. విశేషం ఏమంటే... ఈ సినిమా విడుదలకు ముందే అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శితమై... అవార్డులను, ప్రశంసలను అందుకుంటోంది. ఇటీవల కాలంలో జో శర్మ 'వేవ్స్ 2025' ఈవెంట్ లో అమెరికన్ డెలిగేట్, నటిగా పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో ఆమె ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ముంబైలోని ఐ.ఎం.పి.పి.ఎ. ప్రివ్యూ థియేటర్ లోనూ 'ఎం4ఎం' మూవీని ప్రదర్శించారు.


ఈ సందర్భంగా మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ, ''మా సినిమాను కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్ లో (Cannes Film Festival) ప్రదర్శించడమన్నది ఒక గొప్ప అవకాశం. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. మా టీమ్ అంతా చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం” అని తెలిపారు. 'ఎం4ఎం' సినిమా హత్యా కథాంశం ఆధారంగా ఉత్కంఠభరిత థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి చక్కని స్పందన లభించింది. ఈ చిత్రానికి అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హంతకుడెవరో ఊహించిన వారికి 1000 డాలర్లు లేదా ఒక లక్ష రూపాయల బహుమతి ఇవ్వనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.

Also Read: Hit -3: చైతూ జొన్నలగడ్డకు మరిన్ని అవకాశాలు...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 12 , 2025 | 05:03 PM