లూసిఫర్ మళ్లీ వస్తున్నాడు
ABN, Publish Date - Jan 28 , 2025 | 04:34 AM
మలయాళ నటుడు మోహన్‌లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎల్ 2 ఎంపురాన్’. 2019లో విడుదలై సూపర్‌హిట్ సాధించిన ‘లూసిఫర్’కు...
మలయాళ నటుడు మోహన్‌లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎల్ 2 ఎంపురాన్’. 2019లో విడుదలై సూపర్‌హిట్ సాధించిన ‘లూసిఫర్’కు ఇది కొనసాగింపు. స్టీఫెన్ గట్టుపల్లిగా మొదటిభాగంలో అలరించిన మోహన్‌లాల్, రెండో భాగం ‘ఎల్ 2 ఎంపురాన్’లో గ్యాంగ్‌స్టర్ అబ్రహాం ఖురేషిగా కనిపించనుండడంతో ఈ సినిమా కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుభాస్కరన్, ఆంటోని పెరుంబవూర్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 27న విడుదలవుతోంది. తాజాగా, ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. మలయాళ ఇండస్ట్రీలో మూడు స్తంభాలైనటువంటి మమ్ముట్టి, మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో తళుక్కుమనడం విశేషం. 2 నిమిషాల 23 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో మోహన్‌లాల్ పాత్రలోని విభిన్న రకాల షేడ్స్ గురించి ఎలివేషన్ ఇచ్చే విధానం ఆకట్టుకునేలా ఉంది. అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన విజువల్స్, బీజీఎమ్, సంభాషణలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రంలో టొవినో థామస్, మంజు వారియర్, నందు, సానియా అయ్యప్పన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.