ప్రేమ కథ
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:38 AM
‘ప్రేమించుకుందాం రా, మనసంతా నువ్వే’ తదితర చిత్రాల్లో బాలనటుడిగా ప్రేక్షకులను అలరించిన ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘నిదురించు జహాపనా’...
‘ప్రేమించుకుందాం రా, మనసంతా నువ్వే’ తదితర చిత్రాల్లో బాలనటుడిగా ప్రేక్షకులను అలరించిన ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘నిదురించు జహాపనా’. ప్రసన ్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో సామ్, వంశీ కృష్ణ వర్మ నిర్మించారు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదలవుతోంది. బుధవారం చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా ఆనంద్ వర్ధన్ మాట్లాడుతూ ‘తెలుగు ప్రేక్షకులకు కొత్త కథ చె ప్పాలనే లక్ష్యంతో ఈ సినిమా చేశాం. ప్రేమకథకూ నిద్రకూ ఉన్న సంబంధం ఏమిటనేదే ఈ సినిమా కథ. ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు. నిద్ర చుట్టూ అల్లుకున్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం అని దర్శకుడు తెలిపారు. ఇంటిల్లిపాదిని అలరించే కంటెంట్ ఉన్న చిత్రమిదని నిర్మాత అన్నారు.
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News