చైతూని చూస్తుంటే నాన్నగారు గుర్తొచ్చారు

ABN , Publish Date - Feb 12 , 2025 | 02:20 AM

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తండేల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది....

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తండేల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ‘తండేల్‌ లవ్‌ సునామీ సెలబ్రేషన్స్‌’ను నిర్వహించింది చిత్రబృందం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘‘ఇలా ఓ సక్సెస్‌ మీట్‌కు వచ్చి చాలా రోజులైంది. అరవింద్‌గారు కథ విని చందు దర్శకత్వంలో తీద్దామనుకున్న ఆలోచన.. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం జతకావడం.. బన్నీవాసు సరైన టీమ్‌ను సెట్‌ చేయడం నుంచి.. నాగచైతన్య శోభితాను పెళ్లి చేసుకున్న సందర్భం అన్నీ కలగలసి ‘తండేల్‌’ విజయానికి దోహదపడ్డాయి. ఈ విజయం చాలా ఆనందాన్ని ఇస్తోంది. చందు దర్శకత్వం అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో చైతన్యని చూస్తుంటే నాన్నగారు గుర్తుకువచ్చారు. సాయి పల్లవి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలోని తన పాత్రలో జీవించారు’’ అని చెప్పారు. ‘‘ఒక నటుడికి ఇలాంటి పాత్ర చాలా అరుదుగా దొరుకుతుంటుంది.


ఈ సినిమా రిలీజ్‌కు ముందు నేను బయపడితే అరవింద్‌గారు ధైర్యం చెప్పారు. నా కెరీర్‌లో బెస్ట్‌ ఫిల్మ్‌ అవుతుంది అని అన్నారు. అదృష్టవశాత్తూ అదే జరిగింది’’ అని నాగచైతన్య చెప్పారు. ‘‘చందు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో చైతన్య నటన అద్భుతంగా ఉండబోతోందని ఎడిటింగ్‌ రూమ్‌లోనే అర్థమైపోయింది’’ అని నిర్మాత అల్లు అరవింద్‌ తెలిపారు. ‘‘అక్కినేని నాగేశ్వరరావుగారి ‘తెనాలి రామకృష్ణ’ సినిమాను నాగచైతన్యతో తెరకెక్కిస్తాను’’ అని చందూ అన్నారు. ‘‘నేను పరిశ్రమలో ఎక్కువ సినిమాలు తీసింది నాగార్జునతోనే. ఆయనతో తీసినట్లే నాగచైతన్యతోనూ సినిమాలు తీయాలనుకుంటున్నాను’’ అని నిర్మాత అశ్వనీదత్‌ అన్నారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

For Telangana News And Telugu News

Updated Date - Feb 12 , 2025 | 02:20 AM