గొప్ప అనుభూతిని ఇచ్చే చిత్రం

ABN , Publish Date - May 12 , 2025 | 04:49 AM

నవీన్‌చంద్ర కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లెవన్‌’. లోకేశ్‌ అజ్ల్స్‌ దర్శకత్వంలో అజ్మల్‌ఖాన్‌, రేయా హరి నిర్మించారు. ఈ నెల 16న విడుదలవుతోన్న సందర్భంగా చిత్రబృందం...

నవీన్‌చంద్ర కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లెవన్‌’. లోకేశ్‌ అజ్ల్స్‌ దర్శకత్వంలో అజ్మల్‌ఖాన్‌, రేయా హరి నిర్మించారు. ఈ నెల 16న విడుదలవుతోన్న సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ముఖ్య అతిథి సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ ‘నవీన్‌చంద్ర ఇండస్ట్రీలో చాలా కష్టపడి అవకాశాలు తెచ్చుకున్నారు. అందరూ ఈ సినిమా చూసి ఆయనకు హిట్‌ ఇవ్వండి’ అని కోరారు. నవీన్‌చంద్ర మాట్లాడుతూ ‘ప్రేక్షకులకు గొప్ప ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వాలని చేసిన సినిమా ఇది. కథే ఈ సినిమాకు బలం. థ్రిల్లర్స్‌లో ఇది విభిన్నంగా ఉంటుంది’ అని చెప్పారు. కొత్తతరహా చిత్రం అందించాలని చేసిన ప్రయత్నాన్ని ఆదరించండి అని దర్శకుడు ప్రేక్షకులను కోరారు.

Updated Date - May 12 , 2025 | 04:49 AM