Devan Krishna Leela Movie: అవి రెండూ కర్మలే
ABN , Publish Date - May 17 , 2025 | 12:55 AM
దేవన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న కృష్ణ లీల టీజర్‌ను వి.వి. వినాయక్ విడుదల చేశారు. ప్రేమ, పునర్జన్మల నేపథ్యంతో కూడిన ఈ సూపర్ నేచురల్ లవ్ స్టోరీ ఆద్యంతం ఆకట్టుకుంది.
స్వీయ దర్శకత్వంలో దేవన్ హీరోగా రూపొందుతున్న సూపర్ నేచురల్ లవ్ స్టోరీ ‘కృష్ణ లీల’. ధన్యబాలకృష్ణన్ కథానాయిక. బేబీ వైష్ణవి సమర్పణలో జ్యోత్స్న నిర్మిస్తున్నారు. తాజాగా డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ సినిమా టీజర్‌ని లాంచ్ చేశారు. ‘ప్రేమించడం, ప్రేమించబడటం.. రెండూ కర్మలే. ఈ ప్రేమని అనైతికంగా అనుభవించాలనుకున్నా, అది మరింత కాంప్లికేటెడ్ అయి, ఎన్ని జన్మలైనా నీకు సరైన పాఠం నేర్పే వరకు వదలదు’ అనే పవర్‌ఫుల్ వాయి్‌సతో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.