పీరియాడిక్‌ క్రైమ్‌ డ్రామా

ABN , Publish Date - May 01 , 2025 | 05:56 AM

దీక్షిత్‌ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజ కీలకపాత్రలు పోషిస్తున్న చిత్రం ‘కింగ్‌-జాకీ-క్వీన్‌’. కేకే దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై...

దీక్షిత్‌ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజ కీలకపాత్రలు పోషిస్తున్న చిత్రం ‘కింగ్‌-జాకీ-క్వీన్‌’. కేకే దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. 1990 నేపథ్యంలో సాగే పీరియాడిక్‌ క్రైమ్‌ డ్రామా ఇది. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో హీరో నాని ‘కింగ్‌-జాకీ-క్వీన్‌’ టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దీక్షిత్‌శెట్టి మాట్లాడుతూ ‘తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. ‘దసరా’ చిత్రం తర్వాత మళ్లీ ఆ సినిమాను నిర్మించిన ప్రొడక్షన్‌ హౌస్‌లోనే నా తదుపరి చిత్రం చేయడం ఆనందాన్నిచ్చింది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు. ‘ఈ సినిమా గురించి నేను చెప్పడం కన్నా తెరపైన చూసినప్పుడు మీరు మరింత ఎగ్జైటింగ్‌గా ఫీలవుతారు’ అని కేకే చెప్పారు.

Updated Date - May 01 , 2025 | 05:56 AM