రక్త పిశాచి
ABN , Publish Date - May 27 , 2025 | 03:12 AM
పూర్వజ్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘కిల్లర్’. పూర్వజ్, ప్రజయ్ కామత్, ఏ.పద్మనాభరెడ్డి నిర్మాతలు. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ జ్యోతి పూర్వజ్...
పూర్వజ్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘కిల్లర్’. పూర్వజ్, ప్రజయ్ కామత్, ఏ.పద్మనాభరెడ్డి నిర్మాతలు. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ జ్యోతి పూర్వజ్ నటించిన ‘రక్తిక’ క్యారెక్టర్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. రక్త పిశాచి పాత్రలో ఆమె భీతి గొలుపుతున్నారు. విశాల్ రాజ్, దశరథ్, చందూ, గౌతమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైథాలజీ, సైన్స్ ఫీక్షన్, సూపర్ హీరో..ఇలాంటి అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు చిత్రబృందం తెలిపింది. సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.