నటిగా నా ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాను
ABN , Publish Date - May 07 , 2025 | 01:37 AM
‘హీరోయిన్‌గా నా కెరీర్ గురించి పూర్తి సంతృప్తితో ఉన్నాను. జయాపజయాలు మన చేతిలో ఉండవు. ఫలితం గురించి ఆలోచించకుండా పని చేయడంపైనే నా దృష్టంతా. నటిగా నా ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాను...
‘హీరోయిన్‌గా నా కెరీర్ గురించి పూర్తి సంతృప్తితో ఉన్నాను. జయాపజయాలు మన చేతిలో ఉండవు. ఫలితం గురించి ఆలోచించకుండా పని చేయడంపైనే నా దృష్టంతా. నటిగా నా ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాను’ అని హీరోయిన్ కేతిక శర్మ అన్నారు. కార్తీక్‌రాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ‘సింగిల్’ చిత్రంలో ఆమె కథానాయికగా నటించారు. ఈ నెల 9న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా కేతిక శర్మ మీడియాతో మాట్లాడారు. ‘అల్లు అరవింద్ సమర్పణలో ఓ సినిమా వస్తోందంటే అందులో విషయం ఉంటుంది. గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమా చేయాలనేది ఎప్పటినుంచో నాకున్న కోరిక. అది ‘సింగిల్’ సినిమాతో నెరవేరింది. ప్రేక్షకులకు మంచి వినోదం అందిస్తుంది. ఈ సినిమాలో పూర్వా అనే పాత్రలో కనిపిస్తాను. స్వతంత్ర భావాలున్న యువతి. ఈ తరం అమ్మాయిల ఆలోచనలకు దగ్గరగా ఉంటుంది. కథను మలుపు తిప్పే పాత్ర నాది’ అని తెలిపారు.