కీరవాణి గీతం.. ఇళయరాజా సంగీతం
ABN , Publish Date - Jan 02 , 2025 | 06:30 AM
రూపేష్ హీరోగా, రాజేంద్రప్రసాద్, అర్చన జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘షష్టిపూర్తి’. ఇందులో ఆకాంక్ష సింగ్ కథానాయిక. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు కీరవాణి ‘ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం’ అంటూ ఓ పాటను...
రూపేష్ హీరోగా, రాజేంద్రప్రసాద్, అర్చన జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘షష్టిపూర్తి’. ఇందులో ఆకాంక్ష సింగ్ కథానాయిక. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు కీరవాణి ‘ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం’ అంటూ ఓ పాటను రాయడం ఒక విశేషమైతే, ఇళయరాజా ఈ పాటకు స్వరపరచడం మరో విశేషం. ఇప్పటివరకూ 60కి పైగా పాటలను కీరవాణి రాసినా, ఇళయరాజా బాణీకి ఆయన పాట రాయడం ఇదే ప్రధమమని చిత్ర దర్శకుడు పవన్ ప్రభ చెప్పారు. చిత్రం షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలో సినిమాను విడుదల చేస్తామనీ నిర్మాత రూపేశ్ చౌదరి చెప్పారు.