ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌

ABN , Publish Date - May 11 , 2025 | 03:44 AM

బ్రహ్మాజీ, యశ్వంత్‌ పెండ్యాల (‘కమిటీ కుర్రోళ్లు’ ఫేం)ప్రధాన పాత్రలు పోషించే ‘కథకళి’ చిత్రం షూటింగ్‌ శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. న్యూ ఏజ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో...

బ్రహ్మాజీ, యశ్వంత్‌ పెండ్యాల (‘కమిటీ కుర్రోళ్లు’ ఫేం)ప్రధాన పాత్రలు పోషించే ‘కథకళి’ చిత్రం షూటింగ్‌ శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. న్యూ ఏజ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపుదిద్దుకొనే ఈ చిత్రానికి ప్రసన్నకుమార్‌ నాని దర్శకుడు. రవికిరణ్‌ కలిదిండి నిర్మిస్తున్నారు. నిహారిక కొణిదెల క్లాప్‌ కొట్టి షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఆసక్తికరంగా సాగే ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఇది. వచ్చే నెలలో షూటింగ్‌ ప్రారంభిస్తాం’ అని చెప్పారు.ఈ సినిమాలో కథే హీరో అనీ, కాన్సెప్ట్‌ తనకు బాగా నచ్చిందనీ బ్రహ్మాజీ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం పవన్‌, సినిమాటోగ్రఫీ: జితిన్‌ మోహన్‌.

Updated Date - May 11 , 2025 | 03:44 AM