మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌

ABN, Publish Date - May 14 , 2025 | 05:36 AM

కార్తీక్‌ ఆర్యన్‌ కథానాయకుడిగా అనురాగ్‌ బసు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. టాలీవుడ్‌ కథానాయిక శ్రీలీల ఈ చిత్రంతో బాలీవుడ్‌ అరంగేట్రం...

కార్తీక్‌ ఆర్యన్‌ కథానాయకుడిగా అనురాగ్‌ బసు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. టాలీవుడ్‌ కథానాయిక శ్రీలీల ఈ చిత్రంతో బాలీవుడ్‌ అరంగేట్రం చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. నెలరోజులకు పైగా సాగిన సుదీర్ఘ షెడ్యూల్‌ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా సెట్‌లో దిగిన ఫొటోను కార్తీక్‌ ఆర్యన్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. చక్కని ప్రేమకథతో మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌గా అనురాగ్‌ బసు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీపావళికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - May 14 , 2025 | 05:36 AM