కలలన్నీ నిజమయ్యేలా
ABN , Publish Date - May 05 , 2025 | 05:16 AM
కమల్‌హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘థగ్ లైఫ్’. ‘నాయకుడు’ చిత్రం విడుదలైన మూడున్నర దశాబ్దాల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న చిత్రమిది..
కమల్‌హాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘థగ్ లైఫ్’. ‘నాయకుడు’ చిత్రం విడుదలైన మూడున్నర దశాబ్దాల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న చిత్రమిది. మాఫియా ముఠాల పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే కథతో ‘థగ్ లైఫ్’ను ఆసక్తికరంగా తెరకెక్కించారు మణిరత్నం. హీరో శింబు ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. త్రిష కథానాయిక. సాన్యా మల్హోత్రా, జోజూ జార్జ్, ఐశ్వర్యలక్ష్మి కీలకపాత్రలు పోషిస్తున్నారు. జూన్ 5న ‘థగ్‌లైఫ్’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఏ. ఆర్. రెహమాన్ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రం నుంచి తొలి గీతాన్ని మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. ‘కలలన్నీ నిజమయ్యేలా... జింగుచా జింగూచా’ అంటూ వివాహ వేడుక నేపథ్యంలో ఉత్సాహంగా సాగే ఈ గీతానికి రెహమాన్ వినసొంపైన బాణీలను అందించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, మంగ్లీ, శ్రీకృష్ణ హృద్యంగా ఆలపించారు. కమల్‌హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ ఆనంద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఎన్. సుధాకర్‌రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ: రవి కే చంద్రన్