ప్రచార పర్వం జోరుగా
ABN, Publish Date - May 16 , 2025 | 04:16 AM
కమల్‌హాసన్ కథానాయకుడిగా మణిరత్నం తెరకెక్కించిన చిత్రం ‘థగ్‌లైఫ్’. జూన్ 5న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా పాన్‌ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా...
కమల్‌హాసన్ కథానాయకుడిగా మణిరత్నం తెరకెక్కించిన చిత్రం ‘థగ్‌లైఫ్’. జూన్ 5న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా పాన్‌ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లను వేగవంతం చేస్తోంది టీమ్. ఈ నెల 17న ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ఈనెల 24న హైదరాబాద్‌లో ఆడియో వేడుకను, 29న విశాఖపట్నంలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఎన్.సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. శింబు, జయం రవి, త్రిష కీలక పాత్రలు పోషించారు. ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించారు.