Kamal Haasan: క్షమాపణ చెప్పు లేదంటే మీ సినిమా ఆడదు

ABN , Publish Date - May 30 , 2025 | 05:33 AM

తమిళ భాష నుంచే కన్నడ పుట్టిందని నటుడు కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతటా రగులుతూనే ఉన్నాయి. కన్నడ సంఘాల ఐక్యకూటమి అధ్యక్షుడు వాటాళ్‌ నాగరాజు ఆధ్వర్యంలో...

Kamal Haasan

తమిళ భాష నుంచే కన్నడ పుట్టిందని నటుడు కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతటా రగులుతూనే ఉన్నాయి. కన్నడ సంఘాల ఐక్యకూటమి అధ్యక్షుడు వాటాళ్‌ నాగరాజు ఆధ్వర్యంలో మైసూరు బ్యాంక్‌ సర్కిల్‌లో గురువారం నిరసన తెలిపారు. కన్నడ చరిత్ర గురించి కమల్‌ హాసన్‌కు ఏం తెలుసని వాటాళ్‌ నాగరాజు ప్రశ్నించారు. ఆయన వెంటనే కన్నడిగులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే తమ సత్తా ఎమిటో చూపిస్తామని హెచ్చరించారు. కర్ణాటక రక్షణ వేదిక ముఖ్యుడు ధర్మరాజగౌడ నేతృత్వంలో ఫిల్మ్‌ చాంబర్‌ అసోసియేషన్‌ ఎదుట ఆందోళన చేశారు. ఆ తర్వాత నేరుగా చాంబర్‌లోకి దూసుకెళ్ళి నిరసన తెలిపారు.

ఆంధ్రజ్యోతి, (బెంగళూరు)

Updated Date - May 30 , 2025 | 06:03 AM