Kamal Haasan: క్షమాపణ ప్రసక్తే లేదు
ABN , Publish Date - May 31 , 2025 | 04:19 AM
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కమల్‌హాసన్ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తెలిపారు. డిమాండ్లపై ఆయన తాను తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు.
తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందంటూ ప్రముఖ నటుడు కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవ్వడం తెలిసిందే. క్షమాపణలు చెప్పాలంటూ వస్తున్న డిమాండ్లపై కమల్‌హాసన్ స్పందించారు. తాను ఏమీ తప్పుగా మాట్లాడలేదని, అందువల్ల క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ప్రకటించారు. శుక్రవారం ఉదయం ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలుసుకుని రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
-చెన్నై (ఆంధ్రజ్యోతి)