Union Minister Shobha Karandlaje: కమల్‌ హాసన్‌.. చెల్లని నాణెం

ABN , Publish Date - May 31 , 2025 | 04:15 AM

కమల్‌ హాసన్‌ సినిమాల ప్రచారం కోసం కన్నడ భాషను అవమానించడం సరికాదని కేంద్ర మంత్రి శోభాకరంద్లాజె మండిపడ్డారు. అన్ని భారతీయ భాషలను గౌరవించి, కలిసి జీవించాలనే అంశంపై ఆమె ముఖ్యంగా మాట్లాడారు.

మల్‌హాసన్‌ చెల్లని నాణెం వంటి వాడని కేంద్రమంత్రి శోభాకరంద్లాజె అన్నారు. బెంగళూరులో ఎంఎస్ఎంఈల ప్రగతిపై శుక్రవారం జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి, మీడియాతో మాట్లాడారు. సినిమా ప్రచారం కోసం కన్నడ భాషను అవమానించడం సరికాదని కమల్‌ హాసన్‌పై మండిపడ్డారు. కన్నడ, తెలుగు, తమిళం, మళయాళం.. భాష ఏదైనా మనమంతా భారతీయులమని, కలసి జీవించాలని అన్నారు. మరొకరి భాషను అవమానించడం సరికాదని అన్నారు. అన్ని భాషల వాళ్లు ఆదరిస్తేనే సినీ పరిశ్రమకు మనుగడ సాధ్యమని అన్నారు.

-బెంగళూరు (ఆంధ్రజ్యోతి)

Updated Date - May 31 , 2025 | 07:00 AM