Kamal Haasan: మీ రుణం తీర్చుకోవడానికి చేసిన సినిమా

ABN , Publish Date - May 30 , 2025 | 05:42 AM

విశిష్ట నటుడు కమల్‌ హాసన్‌, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం జూన్‌ 5న విడుదల కానుంది. త్రిష, శింబు కీలక పాత్రలు పోషించిన...

Kamal Haasan

విశిష్ట నటుడు కమల్‌ హాసన్‌, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం జూన్‌ 5న విడుదల కానుంది. త్రిష, శింబు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని హీరో నితిన్‌ తండ్రి సుధాకరరెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. గురువారం సాయంత్రం వైజాగ్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ జరిగింది. ఆ కార్యక్రమంలో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ ‘నా 21 ఏళ్ల వయసులో ‘మరో చరిత్ర’ చిత్రం కోసం ఇక్కడికి వచ్చాను. నేనెవరో ఎవరికీ తెలీదు, షూటింగ్‌ సాఫీగా జరిగింది. సినిమా రిలీజ్‌ అయిన తర్వాత ఎక్కడా నడవలేని పరిస్థితిని ‘మరో చరిత్ర’ కల్పించింది. ఆ తర్వాత మరికొన్ని చిత్రాలు ఇక్కడ చేశాను. వైజాగ్‌ నాకు సొంత ఇల్లు లాంటిది. నేను 15 తెలుగు చిత్రాలు చేస్తే 13 సక్సెస్‌ అయ్యాయి. విజయాలు మీరు ఇచ్చారు. ఫ్లాపులు నేను ఇచ్చాను. మీ రుణం తీర్చుకోవడానికే ‘థగ్‌ లైఫ్‌’ సినిమా మీకు అందిస్తున్నాను’ అన్నారు. ఇది చాలా మంచి సినిమా అనీ, అందరికీ నచ్చతుందని శింబు చెప్పారు. కమల్‌హాసన్‌తో తొలిసారి నటించాననీ ఇటువంటి పాత్ర ఇంతవరకూ చేయలేదని త్రిష తెలిపారు. జూన్‌ 5న ఈ సినిమాను చూసి సూపర్‌ హిట్‌ చేస్తే కమల్‌ను తీసుకువచ్చి ఇక్కడే సక్సెస్‌ మీట్‌ నిర్వహిస్తామని సుధాకరరెడ్డి చెప్పారు.

Updated Date - May 30 , 2025 | 06:02 AM