పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు

ABN , Publish Date - May 26 , 2025 | 04:45 AM

పదవుల కోసమో, ముఖ్యమంత్రిని అవ్వాలనే కోరికతోనో రాజకీయాల్లోకి రాలేదని సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ స్పష్టంచేశారు...

పదవుల కోసమో, ముఖ్యమంత్రిని అవ్వాలనే కోరికతోనో రాజకీయాల్లోకి రాలేదని సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ స్పష్టంచేశారు. మణిరత్నం దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘థగ్‌లైఫ్‌’ చిత్రం ఆడియో రిలీజ్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘సీఎం కావాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాలేదు. రాష్ట్ర ప్రజలకు, నా అభిమానులకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చాను. అనుకున్న లక్ష్యాన్ని నిదానంగా సాధిస్తాం. ఈ ప్రయాణంలో నాతో భాగమైన వారికి ధన్యవాదాలు. ‘థగ్‌లై్‌ఫ’ను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. మేము ఒక మంచి చిత్రాన్ని నిర్మించాం. అందుకే శాటిలైట్‌, ఓటీటీ హక్కులు మాత్రమే విక్రయించాం. సినిమాపై ఉన్న నమ్మకంతో మేమే డిస్ట్రిబ్యూషన్‌ చేస్తున్నాం. ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే, మా బేనరులో ఎన్నో గొప్ప చిత్రాలను రూపొందిస్తాం’ అని పేర్కొన్నారు.

చెన్నై, ఆంధ్రజ్యోతి

Updated Date - May 26 , 2025 | 06:30 AM