Kalivi Vanam Movie: వనజీవి రామయ్య స్ఫూర్తితో

ABN , Publish Date - Jun 07 , 2025 | 06:06 AM

అడవులను రక్షించుకోవాలనే సందేశంతో తెరకె క్కిన చిత్రం ‘కలివి వనం’. రఘుబాబు, సమ్మెట గాంధీ, బిత్తిరి సత్తి, నాగదుర్గ కీలకపాత్రలు పోషించారు. రాజ్‌ నరేంద్ర దర్శకత్వంలో మల్లికార్జున్‌రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి నిర్మించారు.

డవులను రక్షించుకోవాలనే సందేశంతో తెరకె క్కిన చిత్రం ‘కలివి వనం’. రఘుబాబు, సమ్మెట గాంధీ, బిత్తిరి సత్తి, నాగదుర్గ కీలకపాత్రలు పోషించారు. రాజ్‌ నరేంద్ర దర్శకత్వంలో మల్లికార్జున్‌రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి నిర్మించారు. ఇటీవలే చిత్రబృందం టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. సినీ పాత్రికేయుల చేతుల మీదుగా టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘మాకు చెట్లంటే చాలా ఇష్టం. అందుకే ‘కలివి వనం’ చిత్రాన్ని రూపొందించి, ప్రజల్లో అవగాహన పెంచాలనుకుంటున్నాం. ప్రతి సన్నివేశం మనసులో నిలిచిపోయేలా ఉంటుంది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘వనజీవి రామయ్య, దుశ్చర్ల సత్యనారాయణ స్ఫూర్తితో ‘కలివివనం’ చిత్రాన్ని రూపొందించాం. వృక్షాలతో మనిషి అనుబంధాన్నిచర్చిస్తూ సందేశాత్మకంగా సాగుతుంది’ అని చెప్పారు.

Updated Date - Jun 07 , 2025 | 06:08 AM