వెండితెర చెప్పిన బంగారు దర్శకుడి కథ

ABN , Publish Date - Feb 20 , 2025 | 02:58 AM

తెలుగు సినిమాకు గౌరవం, గుర్తింపు తెచ్చిన దర్శకుల్లో ముందు వరుసలో ఉంటారు కళాతపస్వి కె.విశ్వనాథ్‌. సినిమా అంటే కేవలం కమర్షియల్‌ హంగులు, డ్యాన్సులు, ఫైట్లు కావనీ, సంస్కృతి, కళలు, సంప్రదాయ...

తెలుగు సినిమాకు గౌరవం, గుర్తింపు తెచ్చిన దర్శకుల్లో ముందు వరుసలో ఉంటారు కళాతపస్వి కె.విశ్వనాథ్‌. సినిమా అంటే కేవలం కమర్షియల్‌ హంగులు, డ్యాన్సులు, ఫైట్లు కావనీ, సంస్కృతి, కళలు, సంప్రదాయ విలువలు అని తన చిత్రాల ద్వారా చాటి చెప్పిన గొప్ప దర్శకుడాయన. మొత్తం 51 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈ కళాతపస్వి ఇప్పుడు మనమధ్య లేకపోయినా ఆయన చిత్రాలు ఏదో ఒక రూపంలో అలరిస్తూనే ఉన్నాయి. తెలుగు జాతి గర్వించదగ్గ ఇటువంటి దర్శకుడి జీవిత కథను డాక్యుమెంటరీ రూపంలో తీసుకువస్తోంది పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. రచయిత, దర్శకుడు జనార్థనమహర్షి రూపొందించిన ఈ డాక్యుమెంటరీకి విశ్వదర్శనం అనే పేరు పెట్టారు. విశ్వనాథ్‌ జయంతి సందర్భంగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు విశ్వనాథ్‌తో తమకున్న అనుబంధాన్ని ఈ డాక్యుమెంటరీలో వివరించనున్నారు. వెండితెర చెప్పిన బంగారు దర్శకుడి కథ ఇదనీ, త్వరలోనే ఓటీటీలో విడుదల చేస్తున్నామనీ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది.


Also Read:

నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి

మొసలికి చుక్కలు చూపించిన ఏనుగు..

2 విడతల్లో డీఏ..? భారీ పెరగనున్న పెన్షన్లు, జీతాలు..!

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Feb 20 , 2025 | 02:58 AM