Horror Thriller Movie: హారర్ థ్రిల్లర్
ABN , Publish Date - Apr 25 , 2025 | 06:15 AM
హారర్, థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోన్న ‘కాళంకి భైరవడు’ చిత్రం. రాజశేఖర్ వర్మ, పూజా కిరణ్ జంటగా నటిస్తుండగా, దర్శకుడు హరిహరన్
‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’, ‘నివాసి’ చిత్రాల తర్వాత గాయత్రి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘కాళంకి భైరవడు’. హారర్, థ్రిల్లర్ జోనర్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ, పూజా కిరణ్ జంటగా నటిస్తున్నారు. హరిహరన్ దర్శకుడు. దాదాపు షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ లాంచ్ చేశారు. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు కె.ఎన్.రావు, శ్రీనివాసరావు ఆర్ చెప్పారు.