Jurassic Park : మరోసారి ‘జురాసిక్‌ పార్క్‌’

ABN, Publish Date - Feb 08 , 2025 | 07:08 AM

వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్స్‌ తిరిగి భూమ్మీదకు వస్తే ఎలా ఉంటుందనే కాన్సె్‌ప్టతో తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ ఫాంటసీ చిత్రం ‘జురాసిక్‌ పార్క్‌’. 1993లో స్పిల్‌ బర్గ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను

వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్స్‌ తిరిగి భూమ్మీదకు వస్తే ఎలా ఉంటుందనే కాన్సె్‌ప్టతో తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ ఫాంటసీ చిత్రం ‘జురాసిక్‌ పార్క్‌’. 1993లో స్పిల్‌ బర్గ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీని సృష్టించింది. ఆ తరవాత ‘జురాసిక్‌ పార్క్‌’ ఫ్రాంచైజీలో వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే చివరి సారిగా 2022లో వచ్చిన ‘జురాసిక్‌ వరల్డ్‌ డొమినియన్‌’ పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న సినిమానే ‘జురాసిక్‌ వరల్డ్‌ రీ బర్త్‌’. ‘జురాసిక్‌ పార్క్‌’ ఫ్రాంచైజీలో గరేత్‌ ఎడ్వర్డ్స్‌ దర్శకత్వంలో 7వ సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఒక పరిశోధన బృందం తమ అన్వేషణలో భాగంగా జురాసిక్‌ పార్క్‌ ఉన్న ఐలాండ్‌కు వెళ్తుంది. డైనోసార్స్‌ నుంచి డీఎన్‌ఏను సేకరించే క్రమంలో ఎలాంటి ప్రమాధాలు ఎదురయ్యాయి, వాటి బారినుంచి పరిశోధన బృందం తప్పించుకుందా లేదా అనేదాన్ని ట్రైలర్‌లో చూపించారు. ఈ చిత్రం జూలై 2న ఇంగ్లీష్‌, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కానుంది.’

Updated Date - Feb 08 , 2025 | 07:08 AM