Tollywood Producer JJ: కొత్త కథలతో తెరపైకి
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:08 AM
టాలీవుడ్లో నిర్మాతగా ప్రవేశించిన జేజే కొత్త తరానికి కొత్త కథల్ని తెరపైకి తీసుకురావాలని ఉద్దేశ్యంతో పని చేస్తున్నారు. తన నిర్మాణ సంస్థ ‘సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్’ లొగోను ఆవిష్కరించి, త్వరలో ఒక భారీ చిత్రాన్ని ప్రకటించనున్నారు.
JJ Film Announcement: ‘నిర్మాతగా టాలీవుడ్లో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. కొత్త తరాన్ని ప్రోత్సహించడానికి, సరికొత్త కథలను తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం’ అని వర్ధమాన నిర్మాత జేజే అన్నారు. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో తన సొంత నిర్మాణసంస్థ ‘సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్’ బేనర్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేజే మీడియాతో మాట్లాడుతూ ‘త్వరలో ఓ భారీ చిత్రాన్ని ప్రకటిస్తాం. ఇప్పటివరకూ తెలుగులో రాని విభిన్న కథ, కథనాలతో సినిమా రూపొందుతోంది. భవిష్యత్తులో ఎన్నో మంచి చిత్రాలను నిర్మించాలనేదే మా లక్ష్యం’ అని తెలిపారు.