కేన్స్‌లో మెరిసి శ్రీదేవిని గుర్తుచేసి
ABN , Publish Date - May 22 , 2025 | 06:03 AM
హీరోయిన్ జాన్వీ కపూర్ 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తళుక్కున మెరిశారు. ఆమె కేన్స్ రెడ్‌కార్పెట్‌పై దర్శనమివ్వడం ఇదే తొలిసారి. పొడవాటి పింక్ కలర్ గౌన్‌లో ఉన్న ఆమె తన తల్లి, దివంగత హీరోయిన్ శ్రీదేవిని...
హీరోయిన్ జాన్వీ కపూర్ 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తళుక్కున మెరిశారు. ఆమె కేన్స్ రెడ్‌కార్పెట్‌పై దర్శనమివ్వడం ఇదే తొలిసారి. పొడవాటి పింక్ కలర్ గౌన్‌లో ఉన్న ఆమె తన తల్లి, దివంగత హీరోయిన్ శ్రీదేవిని గుర్తుచేశారు. జాన్వీతో పాటు ‘హోమ్ బౌండ్’ చిత్రబృందం కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అన్‌సర్టైన్ రిగార్డ్ విభాగంలో ఈ సినిమాను కేన్స్‌లో ప్రదర్శించనున్నారు. ఈ ఏడాది భారత్ నుంచి ఈ చిత్రోత్సవానికి ఎంపికైన ఏకైక సినిమా ఇదే కావడం విశేషం. ‘మసాన్’ ఫేమ్ నీరజ్ ఘైవాన్ తెరకెక్కించారు. ఇషాన్ కట్టర్ కథానాయకుడు. మరోవైపు కేన్స్ రెడ్‌కార్పెట్‌పై నటి, మాజీ మిస్ హర్యానా టైటిల్ విన్నర్, రుచి గుజ్జర్ మెడలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలు ఉన్న నెక్లెస్ ధరించి అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. ఈ నెల 13న ప్రారంభమైన ఈ వేడుక 24వ తేదీ వరకు జరుగుతుంది. ఇప్పటికే భారత్ నుంచి ఊర్వశీ రౌతేలా, ‘లాపతా లేడీస్’ ఫేమ్ నితాన్షీ గోయల్ తదితరులు రెడ్ కార్పెట్‌పై హొయలొలికించిన సంగతి తెలిసిందే.