అంతకు మించిన ఆనందం మరొకటి లేదు

ABN , Publish Date - May 04 , 2025 | 03:07 AM

‘‘లవ్‌టుడే’ సినిమాలో నా పాత్ర పేరు బుజ్జి కన్నా. ప్రేక్షకులకు ఆ పాత్ర బాగా నచ్చింది. తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ నన్ను ‘బుజ్జి కన్నా’ అంటూ పిలుస్తున్నారు. ఒక నటికి తన పాత్ర...

‘‘లవ్‌టుడే’ సినిమాలో నా పాత్ర పేరు బుజ్జి కన్నా. ప్రేక్షకులకు ఆ పాత్ర బాగా నచ్చింది. తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ నన్ను ‘బుజ్జి కన్నా’ అంటూ పిలుస్తున్నారు. ఒక నటికి తన పాత్ర పేరుతో గుర్తింపు దక్కడం కంటే ఆనందం మరొకటి ఉండదు’ అని హీరోయిన్‌ ఇవానా అన్నారు. శ్రీవిష్ణు కథానాయకుడిగా కార్తీక్‌రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింగిల్‌’ చిత్రంలో ఆమె కథానాయికగా నటించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్‌, రియాజ్‌ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఇవానా సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘‘సింగిల్‌’ కథానాయికగా నాకు తొలి తెలుగు చిత్రం. గీతా ఆర్‌ ్ట్స లాంటి పేరున్న సంస్థలో అవకాశం రావడాన్ని శుభారంభంగా భావిస్తున్నాను. ఇదొక వినోదాత్మక చిత్రం. కుటుంబంతో కలసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది. ఈ సినిమాలో హరిణి అనే డాన్సర్‌గా కనిపిస్తాను. సరదాగా ఉండే యువతిగా, కుటుంబం కోసం ఏం చేయడానికైనా వెనుకాడని ధైర్యవంతురాలిగా భిన్న భావోద్వేగాలను ఆవిష్కరించేలా నా పాత్ర ఉంటుంది. వెన్నెల కిశోర్‌, కేతిక శర్మతో పనిచేయడం సరదాగా అనిపించింది.


శ్రీవిష్ణు గారు ఫోకస్‌ అంతా పని పైనే ఉంటుంది. తెలుగు నేర్చుకోవడంలో ఆయన నాకు సాయం చేశారు. భవిష్యత్తులో నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు మరిన్ని చేయాలనేది నా కోరిక’ అని ఇవానా చెప్పారు.

Updated Date - May 04 , 2025 | 03:07 AM