అద్భుతమైన ప్రపంచంలోకి...
ABN, Publish Date - Jan 08 , 2025 | 02:48 AM
అడవి శేష్ కథానాయకుడిగా విజయ్‌కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జీ 2’. 2018లో విడుదలై ఘనవిజయం సాధించిన స్పై థ్రిల్లర్ ‘గూడఛారి’ సినిమాకు ఇది కొనసాగింపు...
అడవి శేష్ కథానాయకుడిగా విజయ్‌కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జీ 2’. 2018లో విడుదలై ఘనవిజయం సాధించిన స్పై థ్రిల్లర్ ‘గూడఛారి’ సినిమాకు ఇది కొనసాగింపు. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా యూరప్ షూటింగ్ షెడ్యూల్‌లో కథానాయిక, ‘బేబీ జాన్’ ఫేమ్ వామికా గబ్బీ, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ చేరినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా వామికా మాట్లాడుతూ ‘‘ఈ అద్భుతమైన స్పై థ్రిల్లర్ ప్రపంచంలోకి అడుగుపెట్టినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందరో ప్రతిభావంతులతో నిండిన ఈ టీమ్‌తో పనిచేయడం స్ఫూర్తినిస్తోంది’’ అని తెలిపారు. ఈ చిత్రంలో మురళీ శర్మ, సుప్రియ యార్లగడ్డ, మధు షాలినీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.