Naveen Chandra: ఉత్కంఠభరితం లెవెన్ ట్రైలర్

ABN, Publish Date - Apr 30 , 2025 | 04:49 AM

నవీన్‌ చంద్ర హీరోగా లోకేష్‌ అజ్లీస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లెవెన్‌’. ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ను అజ్మల్‌ హరి, రేయా ఖాన్‌ నిర్మించారు. మే 16న...

నవీన్‌ చంద్ర హీరోగా లోకేష్‌ అజ్లీస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లెవెన్‌’. ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ను అజ్మల్‌ హరి, రేయా ఖాన్‌ నిర్మించారు. మే 16న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను కమల్‌హాసన్‌ విడుదల చేశారు. సీరియల్‌ కిల్లింగ్స్‌ నేపథ్యంలో సాగే ఈ ట్రైలర్‌ క్షణక్షణం ఉత్కంఠభరితంగా ఉంది. నవీన్‌ చంద్ర శక్తిమంతమైన పోలీస్‌ అధికారి పాత్రను పోషించారు. రవి వర్మ, కిరీటి దామరాజు, అభిరామి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: శ్రీకాంత్‌.ఎన్‌.బి, సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ అశోకన్‌, సంగీతం: డి.ఇమ్మాన్‌.

Updated Date - Apr 30 , 2025 | 01:01 PM