ఇండో-కొరియన్ హారర్ కామెడీ
ABN, Publish Date - Jan 20 , 2025 | 01:06 AM
వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్....
వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ దీన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. ఈ మేరకు మేకర్స్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ ఒక ప్రత్యేకమైన కొరియన్ కనెక్షన్‌ను చూపిస్తోంది. ఈ ఇండో-కొరియన్ హారర్ కామెడీ చిత్రంలో వరుణ్ తేజ్ యూనిక్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం ప్రొడక్షన్ వర్క్ మార్చిలో ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది వివరాలను త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.