మన దేశం హుందాగా బదులు చెప్పింది

ABN , Publish Date - May 11 , 2025 | 03:46 AM

‘మన దేశం హుందాగా బదులు చెప్పింది. లెట్స్‌ సెల్యూట్‌ ద ఇండియన్‌ ఆర్మీ. ‘హిట్‌-3’ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. కమర్షియల్‌ సినిమాలా సెలెబ్రేట్‌ చేసుకోవడం సంతోషంగా ఉంది’ అని అన్నారు హీరో నాని...

‘మన దేశం హుందాగా బదులు చెప్పింది. లెట్స్‌ సెల్యూట్‌ ద ఇండియన్‌ ఆర్మీ. ‘హిట్‌-3’ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. కమర్షియల్‌ సినిమాలా సెలెబ్రేట్‌ చేసుకోవడం సంతోషంగా ఉంది’ అని అన్నారు హీరో నాని. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హిట్‌-3’ విడుదలై మంచి ప్రేక్షకాదరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో నాని మాట్లాడుతూ‘ ప్రస్తుతం దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో సెలెబ్రేషన్స్‌ నిర్వహించవచ్చా అనే చర్చ వచ్చింది. శత్రువులు మనకు ఒక సమస్య సృష్టించాలని ప్రయత్నించారు. వాళ్ల కారణంగా ఇండియాలో ఒకచోట సెలెబ్రేషన్స్‌ రద్దయ్యాయనే సంతృప్తిని ఇవ్వకూడదనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం’ అని వివరించారు. హీరో అడవి శేష్‌ మాట్లాడుతూ ‘మన దేశం కోసం సైనికులు పోరాడుతుంటే గర్వంగా ఉంది’ అని అన్నారు. ‘మంచి కంటెంట్‌ని ఆదరిస్తారని ప్రేక్షకులు మరోసారి రుజువు చేశారని’ చిత్ర దర్శకుడు శైలేష్‌ కొలను పేర్కొన్నారు.

Updated Date - May 11 , 2025 | 03:46 AM