ప్రేమ.. బ్రేకప్ నేపథ్యంలో
ABN , Publish Date - Feb 11 , 2025 | 05:01 AM
పా పాండి, రాయన్ వంటి బ్లాక్ బస్టర్‌ల తర్వాత ధనుష్ దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా..
పా పాండి, రాయన్ వంటి బ్లాక్ బస్టర్‌ల తర్వాత ధనుష్ దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 21న విడుదలవుతోంది. తెలుగులో ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ప్రారంభంలో..ధనుష్ కనిపించి ఇదొక సాధారణ ప్రేమ కథ అని అసలు కథలోకి తీసుకెళ్తాడు. ఓ ప్రేమ, బ్రేకప్ నేపథ్యంలో ఈ సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉండబోతోంది.
For Telangana News And Telugu News