అందుకోసమే ఆ చీర దాచుకున్నా

ABN , Publish Date - Feb 17 , 2025 | 03:01 AM

జాతీయ అవార్డు కోసం ఎదురు చూస్తున్నానని, అవార్డుల ప్రదానోత్సవానికి అమ్మమ్మ ఇచ్చిన చీర కట్టుకుని వెళ్లే సమయం కోసం వేచి చూస్తున్నానని సాయిపల్లవి తెలిపారు. తన అభినయంతో ఎంతో మంది...

జాతీయ అవార్డు కోసం ఎదురు చూస్తున్నానని, అవార్డుల ప్రదానోత్సవానికి అమ్మమ్మ ఇచ్చిన చీర కట్టుకుని వెళ్లే సమయం కోసం వేచి చూస్తున్నానని సాయిపల్లవి తెలిపారు. తన అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ భామ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాతీయ అవార్డు కోసం ఎదురుచూడటం వెనక ఉన్న బలమైన కారణాన్ని వివరించారు. ‘జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది. నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఓ చీర ఇచ్చి, నా పెళ్లిలో కట్టుకోమ్మంది. అప్పటికి నేనింకా సినిమాల్లోకి రాలేదు. కనుక పెళ్లి చేసుకునేటప్పుడు కట్టుకుందామనుకున్నా. ఆ తర్వాత మూడేళ్లకు సినిమాల్లో నటించడం మొదలు పెట్టా. నా తొలి చిత్రం ‘ప్రేమమ్‌’లో నటిస్తున్నప్పుడే ఏదో ఒక రోజు జాతీయ స్థాయి అవార్డును అందుకోగలననే నమ్మకం ఏర్పడింది. ఆ రోజు అమ్మమ్మ ఇచ్చిన చీర కట్టుకుని అవార్డుల ప్రదానోత్సవానికి హాజరవ్వాలని నిర్ణయించుకున్నా. అవార్డును అందుకున్నా... అందుకోకపోయినా చీర కట్టుకోవాలనే ఒత్తిడి ఉండనే ఉంటుంది’ అని చెప్పారు సాయిపల్లవి. కాగా, ‘గార్గి’ చిత్రానికి గాను జాతీయ అవార్డు వస్తుందని సాయిపల్లవి అభిమానులు ఎంతగానో ఆశించారు. చివరకు నిరాశే ఎదురైంది.


For Telangana News And Telugu News

Updated Date - Feb 17 , 2025 | 03:01 AM