జాతీయ భద్రతా నిధికి విరాళం
ABN , Publish Date - May 11 , 2025 | 03:37 AM
జాతీయ భద్రతా నిధి (నేషనల్ సెక్యూరిటీ ఫండ్)కి ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేయనున్నట్టు ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు ఇళయరాజా...
జాతీయ భద్రతా నిధి (నేషనల్ సెక్యూరిటీ ఫండ్)కి ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేయనున్నట్టు ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు ఇళయరాజా ప్రకటించారు. ఈ విషయంపై ఆయన శనివారం ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ‘పహల్గాం ఉగ్రచర్యకు వ్యతిరేకంగా భారత రక్షణశాఖ సైనిక చర్యకు శ్రీకారం చుట్టడంతో మన జవానులు సరిహద్దుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి దేశ ప్రజలు, దేశ సరిహద్దులను రక్షించే పనుల్లో నిమగ్నమైవున్నారు. ఈ తరుణంలో రాజ్యసభ సభ్యుడిగా జాతీయ భద్రతా నిధికి ఒక నెల వేతనంతో పాటు నా సంగీత విభావరి ద్వారా వచ్చే నిధులను కూడా విరాళంగా అందజేస్తాను’ అని ఇళయరాజా పేర్కొన్నారు.
చెన్నై (ఆంధ్రజ్యోతి)