ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి

ABN, Publish Date - Jan 19 , 2025 | 01:28 AM

రచిత మహాలక్ష్మి, కమల్‌ కామరాజు, సాత్విక్‌, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘తల్లి మనసు’. వి. శ్రీనివా్‌స (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య...

రచిత మహాలక్ష్మి, కమల్‌ కామరాజు, సాత్విక్‌, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘తల్లి మనసు’. వి. శ్రీనివా్‌స (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తనయుడు అనంత కిశోర్‌ నిర్మించారు. ఈనెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ ‘తల్లికి ఎన్ని నిర్వచనాలు ఇచ్చినా సరిపోవు. అలాంటి తల్లి సబ్జెక్టును తీసుకొని సినిమా చేశాం. ప్రేక్షకులు కథలో, పాత్రలలో పూర్తిగా నిమగ్నమయ్యేవిధంగా సినిమా వచ్చింది. ఇలాంటి మంచి చిత్రాలను ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి’ అని అన్నారు. దర్శకుడు వి. శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘ఓ తల్లి ఎలాంటి సంఘర్షణలకు గురయ్యిందన్న అంశాన్ని ప్రేక్షకులకు హత్తుకునేలా వైవిధ్యంగా చెప్పాం’ అని తెలిపారు.

Updated Date - Jan 19 , 2025 | 01:28 AM