బాలీవుడ్‌ను వదిలేస్తా

ABN , Publish Date - Jan 03 , 2025 | 06:25 AM

‘ఇకపై నేను బాలీవుడ్‌లో సినిమాలు చేయాలనుకోవడం లేదు. దక్షిణాది పరిశ్రమతో కలసి పనిచేస్తాను. ఇన్నేళ్లు పనిచేసినా ఇక్కడ నాకు పెద్దగా గుర్తింపు రాలేదు. బాలీవుడ్‌ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది...

‘ఇకపై నేను బాలీవుడ్‌లో సినిమాలు చేయాలనుకోవడం లేదు. దక్షిణాది పరిశ్రమతో కలసి పనిచేస్తాను. ఇన్నేళ్లు పనిచేసినా ఇక్కడ నాకు పెద్దగా గుర్తింపు రాలేదు. బాలీవుడ్‌ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. నిర్మాతలకు ఎంతసేపూ లాభాలు పిండుకోవాలనే యావ తప్ప ప్రయోగాత్మక చిత్రాలకు ఇక్కడ స్థానం లేదు’ అని బాలీవుడ్‌ దర్శకుడు, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ చెప్పారు. బాలీవుడ్‌ దర్శకులు హిందీ ప్రేక్షకులను నిర్లక్ష్యం చేయడం వల్ల్లే అక్కడి మార్కెట్‌లో దక్షిణాది చిత్రాలు పాగా వేస్తున్నాయని అన్నారు. ప్రేక్షకుల అభిరుచిని పట్టించుకోకపోతే ఇలానే జరుగుతుంది, బాలీవుడ్‌ సినిమాల్లో పస లేదు, పరభాషా చిత్రాలను కాపీ కొట్టి సినిమాలు చేస్తున్నారు అని అసంతృప్తి వ్యక్తం చేశారు. దక్షిణాదిన మాత్రం కొత్త తరహా కథలతో సినిమాలు వస్తున్నాయి. అక్కడి సినిమాలను హిందీలో డబ్‌చేసి యూట్యూబ్‌లో పెట్టడం ద్వారా ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకొని మార్కెట్‌ను పెంచుకోగలిగారు’ అని అన్నారు.

అనురాగ్‌ కశ్యప్‌

Updated Date - Jan 03 , 2025 | 06:25 AM