హృతిక్‌తో హోంబలే ఫిల్మ్స్‌ చిత్రం

ABN , Publish Date - May 29 , 2025 | 01:46 AM

‘కేజీఎఫ్‌’, ‘సలార్‌’, ‘కాంతార’ వంటి పలు భారీ, విభిన్న చిత్రాలు నిర్మిస్తూ భారతీయ చిత్ర పరిశ్రమలో పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగిన హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ ఇప్పుడు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌తో చేతులు...

‘కేజీఎఫ్‌’, ‘సలార్‌’, ‘కాంతార’ వంటి పలు భారీ, విభిన్న చిత్రాలు నిర్మిస్తూ భారతీయ చిత్ర పరిశ్రమలో పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగిన హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ ఇప్పుడు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌తో చేతులు కలిపింది. ఇది హృతిక్‌ అభిమానులకు, సినిమా ప్రేమికులకూ ఆనందకరమైన వార్తే. ఈ సందర్భంగా హోంబలే ఫిల్మ్స్‌ అధినేత విజయ్‌ కిరగందూర్‌ మాట్లాడుతూ ‘స్ఫూర్తిదాయకమైన కథలను చెప్పాలన్న ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాం. హృతిక్‌ రోషన్‌తో ఓ గొప్ప సినిమా ఎక్స్‌పీరియన్స్‌ అందించాలన్న లక్ష్యాన్ని సాకారం చేస్తాం. ఆ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది’ అన్నారు. హృతిక్‌ రోషన్‌ మాట్లాడుతూ ‘వైవిధ్యమైన చిత్రాలు అందిస్తున్న హోంబలే ఫిల్మ్స్‌ వంటి సంస్థతో కలసి పని చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. మేం పెద్ద కలలు కంటున్నాం. వాటిని నిజం చేసేందుకు అంకిత భావంతో పని చేస్తాం’ అన్నారు.

Updated Date - May 29 , 2025 | 01:46 AM