అంచనాలకు మించిన ఆదరణ

ABN , Publish Date - May 04 , 2025 | 03:14 AM

‘‘హిట్‌ 3’ చిత్రానికి మా అంచనాలకు మించి ప్రేక్షకాదరణ దక్కుతోంది. మేం ఊహించిన దానికి భిన్నంగా మహిళా ప్రేక్షకులకు అర్జున్‌సర్కార్‌ పాత్ర అమితంగా నచ్చడం...

‘‘హిట్‌ 3’ చిత్రానికి మా అంచనాలకు మించి ప్రేక్షకాదరణ దక్కుతోంది. మేం ఊహించిన దానికి భిన్నంగా మహిళా ప్రేక్షకులకు అర్జున్‌సర్కార్‌ పాత్ర అమితంగా నచ్చడం ఆశ్చర్యపరిచింది. బహుశా నాని పాత్ర చిత్రణ విభిన్నంగా ఉండడం అందుకు కారణం కావొచ్చు’ అని దర్శకుడు శైలేష్‌ కొలను అన్నారు. ఆయన దర్శకత్వంలో నాని కథానాయకుడిగా నటించిన ‘హిట్‌ 3’ చిత్రం ఇటీవలే విడుదలై ప్రేక్షకాదరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా శైలేష్‌ కొలను మీడియాతో మాట్లాడారు. ‘అర్జున్‌ సర్కార్‌ పాత్ర మీద నానికీ, నాకూ మొదట్నుంచి గట్టి నమ్మకం ఉంది. దానికి తగ్గట్లే ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంది. మాస్‌ ఛాయలున్న పాత్ర కావడంతో పాటు ఆయన వినోదం పండించిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తోంది. ‘హిట్‌ 3’ లో ఒక నేషనల్‌ లెవల్‌ క్రైమ్‌ను చూపించాం. ప్రతి సన్నివేశంలో ప్రేక్షకులు విజిల్‌ కొట్టాలనే ఉద్దేశంతో కథ రాసుకున్నాను. ఆ లక్ష్యం నెరవేరిందనే అనుకుంటున్నాను. మిక్కీ జే. మేయర్‌ నేపథ్య సంగీతం, సముద్రఖని, రావు రమేశ్‌, శ్రీనిధి శెట్టి నటన సినిమా విజయానికి కీలకంగా నిలిచాయి. ఈ సినిమాకు నాని నిర్మాత కావడం నాకు కలిసొచ్చింది. అనుకున్న విధంగా తెరకెక్కించే స్వేచ్ఛనిచ్చారు. నా తదుపరి చిత్రం రొమాంటిక్‌ కామెడీ జానర్‌లో చేయాలనుకుంటున్నాను’ అని శైలేష్‌ చెప్పారు.

Updated Date - May 04 , 2025 | 03:14 AM