మల్లయుద్ధం నేపథ్యంలో
ABN, Publish Date - Feb 17 , 2025 | 02:48 AM
తమిళ హీరో శివకార్తికేయన్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుత్ను చిత్రం ‘ఎస్‌కె23’(వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో సప్త సాగర దాచె...
తమిళ హీరో శివకార్తికేయన్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుత్ను చిత్రం ‘ఎస్‌కె23’(వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో సప్త సాగర దాచె ఎల్లో(సప్త సాగరాలు దాటి) ఫేమ్ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో చెన్నైలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో మల్లయుద్ధం నేపథ్యంలో సాగే పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నట్లు యూనిట్ తెలిపింది. ఈ చిత్రం టైటిల్‌ను నేడు ప్రకటించనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.
For Telangana News And Telugu News