త్వరలోనే బ్యాడ్‌బాయ్
ABN, Publish Date - May 14 , 2025 | 05:33 AM
హీరో నాగశౌర్య నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్యాడ్‌బాయ్ కార్తీక్’. రామ్ దేశినా దర్శకత్వంలో శ్రీనివాస చింతలపూడి నిర్మిస్తున్నారు. విధి హీరోయిన్...
హీరో నాగశౌర్య నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్యాడ్‌బాయ్ కార్తీక్’. రామ్ దేశినా దర్శకత్వంలో శ్రీనివాస చింతలపూడి నిర్మిస్తున్నారు. విధి హీరోయిన్. ఇటీవలె విడుదలైన ఫస్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. సముద్రఖని, వీకె నరేశ్, సాయికుమార్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా షూట్ పూర్తైందని మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డీఓపీ: రసూల్ ఎల్లోర్, సంగీతం: హారిస్ జైరాజ్.