ఆకట్టుకొనే శక్తిమతి

ABN , Publish Date - May 13 , 2025 | 02:55 AM

హెబ్బా పటేల్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘శక్తిమతి’ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను దర్శకుడు వి.వి. వినాయక్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత వెంకటేశ్‌ గౌడ్‌...

హెబ్బా పటేల్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘శక్తిమతి’ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను దర్శకుడు వి.వి. వినాయక్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత వెంకటేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ ‘దర్శకుడు చెప్పిన పాయింట్‌ నచ్చి ఈ సినిమా తీశా. ఆగస్టులో విడుదల చేస్తాం’ అని చెప్పారు. దర్శకుడు డి.రామకృష్ణ మాట్లాడుతూ ‘మా గురువు వినాయక్‌గారి చేతుల మీదుగా మోషన్‌ పోస్టర్‌ విడుదల కావడం ఆనందంగా ఉంది.. సినిమాలో దాదాపు 30 నిముషాల పాటు సీజీ వర్క్‌ ఉంటుంది. మా నిర్మాత వెంకటేశ్‌ గౌడ్‌ రాజీపడకుండా సినిమా తీశారు. అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు.

Updated Date - May 13 , 2025 | 02:55 AM