హృదయాలను హత్తుకునే సినిమా

ABN , Publish Date - Jan 21 , 2025 | 06:33 AM

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకురాలు. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో....

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకురాలు. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ఎన్నో అవార్డులను దక్కించుకున్న ఈ చిత్రం ఈనెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు పద్మావతి మల్లాది మీడియాతో ముచ్చటించారు. ‘నాకు స్వతహాగా పచ్చదనం, చెట్టు అంటే చాలా ఇష్టం. మొక్కల గురించి తదుపరి తరం వాళ్లకు చెప్పాలనే సంకల్పంతో ఈ కథ రాసుకున్నాను. ఒక అమ్మాయి అహింసవాదంతో ఊరిని, చెట్టును ఎలా కాపాడింది అనేది ఈ చిత్ర కథ. పూర్తి సందేశంతో పాటు కమర్షియాలిటీ ఉన్న సినిమా. తప్పకుండా అందరి హృదయాలను హత్తుకుంటుంది. ఈ కథ 1947లో గాంధీగారు చనిపోయినప్పుడు తాత నాటిన చెట్టుతో ప్రారంభమవుతుంది. ఈ సినిమాతో అహింస గురించి చెప్పాను. మనుషుల మధ్య నేచర్‌ మధ్య అహింస చాలా అవసరం’ అని అన్నారు.

Updated Date - Jan 21 , 2025 | 06:33 AM