Teaser : సైకలాజికల్ థ్రిల్లర్
ABN , Publish Date - Jan 11 , 2025 | 02:50 AM
ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ ప్రధాన పాత్రల్లో శ్రీవిద్య బసవ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘హత్య’.
ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ ప్రధాన పాత్రల్లో శ్రీవిద్య బసవ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘హత్య’. ఎస్.ప్రశాంత్ రెడ్డి నిర్మాత. ఈనెల 24న విడుదలవుతోంది. నటుడు రవివర్మ చేతుల మీదుగా చిత్రం టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు శ్రీ విద్య బసవ మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని సీట్ ఎడ్జ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా అలరించేలా తెరకెక్కించాను. నరేశ్ అద్భుతమైన బీజీఎంను అందించాడు. అభిరాజ్ విజువల్స్ చక్కగా కుదిరాయి’ అని తెలిపారు. నటుడు రవివర్మ మాట్లాడుతూ ‘రోటీన్‌కు భిన్నమైన రోల్‌కు శ్రీవిద్య నన్ను ఎంపిక చేశారు. ఇది నాకొక ఛాలెంజింగ్ రోల్’ అని అన్నారు.