కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం
ABN, Publish Date - May 06 , 2025 | 05:21 AM
‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘హ్యాష్‌ట్యాగ్ సింగిల్’. శ్రీవిష్ణు హీరోగా గీతాఆర్ట్స్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. ఇవానా, కేతిక శర్మ కథానాయికలు....
‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘హ్యాష్‌ట్యాగ్ సింగిల్’. శ్రీవిష్ణు హీరోగా గీతాఆర్ట్స్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. ఇవానా, కేతిక శర్మ కథానాయికలు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 9న చిత్రం విడుదలవుతోన్న సందర్భంగా కార్తీక్ మీడియాతో ముచ్చటించారు. ‘‘ఈ కథను శ్రీవిష్ణుకి చెప్పగానే.. ‘బాగుంది తప్పకుండా చేద్దాం’ అన్నారు. సినిమా ఆయన బాడీలాంగ్వేజ్‌కు తగ్గట్లుగా ఉంటుంది. ఆయన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఆద్యంతం వినోదంతో సాగిపోయే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుంది. వెన్నెల కిషోర్ పాత్ర సినిమాలో కీలకం. శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలకి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. ఇవానా, కేతిక పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది. శ్రీవిష్ణు అద్భుతమైన నటుడు. ఆయన టైమింగ్ చాలా బాగుంటుంది. ఆయన నటన సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన సంగీతం ప్రధానాకర్షణ. వినోదంతో పాటూ మంచి భావోద్వేగాలూ ఉన్నాయి. కుటుంబసమేతంగా చూడదగ్గ ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.