Muralimanohar Direction: వినోదం పంచేలా
ABN, Publish Date - May 03 , 2025 | 06:28 AM
'గుర్రం పాపిరెడ్డి' అనే చిత్రం హాస్యభరితంగా ఉండబోతుందని పోస్టర్‌లో కన్పిస్తుంది. నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషిస్తారు, మురళీ మనోహర్ దర్శకత్వం వహిస్తున్నారు.
నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా మురళీ మనోహర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. డా.సంధ్య గోలి సమర్పణలో వెను సద్ది, అమర్ బురా, జయకాంత్(బాబీ) నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్‌ని మేకర్స్ శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఆద్యంతం హాస్యభరితంగా ఉండబోతున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. విభిన్నంగా తీర్చిదిద్దిన క్యారెక్టర్లను హైదరాబాద్ నగర బ్యాక్‌డ్రాప్‌లో స్టైలిష్గా ప్రెజెంట్ చేశారు.