ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది

ABN , Publish Date - May 26 , 2025 | 04:40 AM

నూతన నటీనటులతో దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. భూమికా చావ్లా, సారా అర్జున్‌, రోహిత్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే చిత్రబృందం...

నూతన నటీనటులతో దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. భూమికా చావ్లా, సారా అర్జున్‌, రోహిత్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే చిత్రబృందం నిర్వహించిన కార్యక్రమంలో ‘యుఫోరియా’ నుంచి ఫ్లై హై అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. కిట్టు విస్సాప్రగడ సాహిత్యానికి కాలభైరవ స్వరాలు సమకూర్చడంతో పాటు పృథ్వీ చంద్ర, గాయత్రీ నటరాజన్‌తో కలసి ఆలపించారు. ఈ సందర్భంగా గుణశేఖర్‌ మాట్లాడుతూ ‘ప్రేక్షకులు చూపించే ఎనర్జీయే ‘యుఫోరియా’. ఇదే ఎనర్జీ సినిమాలోనూ ఉంటుంది. యూత్‌ఫుల్‌ బ్యాక్‌డ్రా్‌పలో ఈ సినిమా తీస్తున్నాను. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అన్నారు. నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ ‘హై ఫ్లై పాట అందరికీ నచ్చుతుంది. ఇదొక విభిన్న చిత్రం’ అన్నారు.

Updated Date - May 26 , 2025 | 04:40 AM