గంగై అమరన్‌కు తీవ్ర అస్వస్థత

ABN , Publish Date - Jan 07 , 2025 | 06:40 AM

సీనియర్‌ సంగీత దర్శకుడు, ఇళయరాజా సోదరుడు గంగై అమరన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను మదురైలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 77 యేళ్ళ గంగై అమరన్‌...

సీనియర్‌ సంగీత దర్శకుడు, ఇళయరాజా సోదరుడు గంగై అమరన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను మదురైలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 77 యేళ్ళ గంగై అమరన్‌ ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ మానామదురై, శివగంగై ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్ళిన ఆయన ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన మానామదురైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి ప్రాథమిక వైద్యం చేయించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్య సేవల కోసం మదురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న గంగై అమరన్‌ కుమారుడు, దర్శకుడు వెంకట్‌ ప్రభు, నటుడు ప్రేమ్‌జీ అమరన్‌ మదురైకు చేరుకున్నారు. చలికాలం కావడంతో అమరన్‌ శ్వాస పీల్చడంలోనే సమస్యలు మినహా ఆరోగ్యపరంగా బాగానే ఉన్నారని వైద్యులు వెల్లడించారు.

Updated Date - Jan 07 , 2025 | 06:40 AM