Sangeeth Shobhan: ప్రేక్షకుల ముందుకు గ్యాంబ్లర్స్‌

ABN , Publish Date - May 24 , 2025 | 01:36 AM

సంగీత్‌ శోభన్‌ కథానాయకుడిగా నటించిన ‘గ్యాంబ్లర్స్‌’ చిత్రం జూన్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. థ్రిల్లింగ్‌ అంశాలతో కూడిన ఈ చిత్రానికి కేఎస్‌కే చైతన్య దర్శకత్వం వహించారు.

సంగీత్‌ శోభన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గ్యాంబ్లర్స్‌’. ప్రశాంతి చారులింగ కథానాయిక. కేఎ్‌సకే చైతన్య దర్శకుడు. సునీత, రాజ్‌కుమార్‌ బృందావనం నిర్మాతలు. చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. జూన్‌ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌లో సంగీత్‌ శోభన్‌ సీరియస్‌ లుక్‌లో కనిపించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో ఉండే థ్రిల్లింగ్‌ అంశాలు, మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సంగీత్‌ శోభన్‌ మేనరిజమ్స్‌, శారీరక భాషను అర్థం చేసుకొని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు’ అని చెప్పారు. కొత్త కాన్సె్‌ప్టతో థ్రిల్లింగ్‌ అంశాలతో రూపొందిన గ్యాంబ్లర్స్‌ ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శశాంక్‌ తిరుపతి.

Updated Date - May 24 , 2025 | 01:39 AM