Friday: ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనితచే ‘అమ్మ’ పాట
ABN, Publish Date - May 12 , 2025 | 05:50 PM
దియా రాజ్, ఇనయ సుల్తానా, రిహానా, వికాస్ వశిష్ట, రోహిత్ బొడ్డపాటి హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘ఫ్రై డే’.
దియా రాజ్(Diaraj), ఇనయ సుల్తానా (inaya sultana), రిహానా, వికాస్ వశిష్ట, రోహిత్ బొడ్డపాటి హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘ఫ్రై డే’ (Friday) శ్రీ గణేష్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద కేసన కుర్తి శ్రీనివాస్ నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ఈశ్వర్ బాబు ధూళిపూడి తెరకెక్కించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మదర్స్ డే సందర్భంగా అమ్మ ప్రేమను చాటే పాటను రిలీజ్ చేశారు. అమ్మ అంటూ సాగే ఈ పాటను ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం రిలీజ్ చేశారు. అనంతరం ఈ పాటను చూసి చిత్రయూనిట్‌ను అభినందించారు. అమ్మ ప్రేమను చాటి చెప్పేలా ఎంతో అందంగా పాటను చిత్రీకరించారని ప్రశంసించారు. చిత్రయూనిట్ కు ఆమె ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ పాటను స్నిగ్ద నయని ఆలపించారు. మధు కిరణ్ సాహిత్యం ప్రతీ ఒక్కరి మనసుల్ని కదిలించేలా ఉంది. ప్రజ్వల్ క్రిష్ బాణీ ప్రతీ ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంది. ప్రస్తుతం ఈ పాట మదర్స్ డే స్పెషల్‌గా నెట్టింట్లో వైరల్ అయ్యేలా ఉంది.
ఈశ్వర్ బాబు మాట్లాడుతూ .. ‘‘ఫ్రై డే’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. పహల్గాం అటాక్ తరువాత నా మనసు కదిలిపోయింది. నాకు సామాజిక బాధ్యత ఉంది. గతంలో నేను గాడ్సే మీద సినిమా తీశాను. సోషల్ మీడియా వాడకం వల్ల ఇప్పుడు గాడ్సే గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నారు. ఈ ‘ఫ్రై డే’ చిత్రంలో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. మదర్స్ డే సందర్భంగా ‘అమ్మ’ పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మా సినిమాను చూసిన తరువాత ప్రతీ తల్లి తన కొడుకుని ఓ ఛత్రపతి శివాజీలా, మహారాణా ప్రతాప్ సింగ్‌లా పెంచుతారు. పోరాడే శక్తిని అమ్మ మాత్రమే ఇస్తుంది’ అని అన్నారు.