అలరించే అమ్మ కథ

ABN , Publish Date - May 12 , 2025 | 04:56 AM

అమ్మ గొప్పదనాన్ని ఆవిష్కరించే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫ్రైడే’. ఈశ్వర్‌బాబు దర్శకత్వంలో కేసనకుర్తి శ్రీనివాస్‌ నిర్మించారు. దియా రాజ్‌, ఇనయ సుల్తానా, రోహిత్‌ ప్రధాన తారాగణం...

అమ్మ గొప్పదనాన్ని ఆవిష్కరించే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఫ్రైడే’. ఈశ్వర్‌బాబు దర్శకత్వంలో కేసనకుర్తి శ్రీనివాస్‌ నిర్మించారు. దియా రాజ్‌, ఇనయ సుల్తానా, రోహిత్‌ ప్రధాన తారాగణం. ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ హోం మినిస్టర్‌ వంగలపూడి అనిత చేతుల మీదుగా చిత్రబృందం పాటను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఈశ్వర్‌ చెప్పిన కథ నాకు బాగా నచ్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించాను, ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని నిర్మాత చెప్పారు. ‘బిడ్డ గొప్పగా ఎదగాలని తల్లి కలలు కంటుంది, అందుకు ఎంత కష్టమైనా ఓర్చుకుంటుంది. ఆ క్రమాన్ని మా చిత్రంలో చూపించబోతున్నాం’ అని దర్శకుడు చెప్పారు.

Updated Date - May 12 , 2025 | 04:56 AM